ఒంగోలు ( జనస్వరం ) : ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 19వ రోజు ఒంగోలులోని రంగారాయుడు చెరువు మీద పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులతో వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుతూ ఇప్పటిదాకా అందరికీ ఒక అవకాశం ఇచ్చామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికీ కూడా ఈసారి ఒక అవకాశం ఇస్తామని, ఆయన చేసిన కార్యక్రమాలు మమ్మల్ని ప్రభావితం చేశాయని అన్నారు. ఆయన సారథ్యం లో తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి రావాలన్నా, రైతన్నకు అండగా నిలవాలన్నా, మహిళలకు రక్షణ ఉండాలన్న, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్న అది పవన్ కళ్యాణ్ గారి పాలనలోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని, బడుగు బలహీన వర్గాలకు అండగా జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆర్ కె నాయుడు ముత్యాల, పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, నవీన్ పవర్, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, 3వ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్, మరియు జనసేన నాయకులు అరవింద్ బాబు ముత్యాల, బండారు సురేష్, సుభాని షేక్, చెన్ను నరేష్, అవినాష్ పర్చూరి, జనసేవ శ్రీనివాస్, నాగరాజు ఈదుపల్లి మరియు వీర మహిళ మాదాసు సాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com