Logo
Date of Publish : 22 February 2023, 3:08 pm
Editor : Sake Naresh

రాజకీయాల్లో మార్పు కోసమే జనసేన పార్టీని స్థాపించారు : పోతిన మహేష్

        విజయవాడ (జనస్వరం) : జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు రాజకీయాలలో మార్పు కోసం బాధ్యతాయుతంగా పనిచేసే యువతకు అవకాశాలు కల్పించడంతో పాటు, ఒక తరానికి అవకాశాలు కల్పిస్తూమరొక తరానికి వారధిగా నిలవడం జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు, పశ్చిమ నియజకవర్గ ఇంఛార్జి పోతిన మహేష్ అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు, బుధవారం ప్రెస్ నోట్ ను విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను నమ్మి మమేకమవుతున్న ప్రజలు లక్షలాదిమంది యువత పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సారధ్యంలో బలంగా నిర్మాణాన్ని రూపొందించుకుంటూ క్షేత్రస్థాయిలో బలపడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటం కోసం, వైయస్సార్సీపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిస్వార్ధంగా నిరంతరం కృషి చేస్తున్నారు. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతాయుతంగా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి సాధన కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాల్సినటువంటి కీలక తరుణమన్నారు. నగరంలో పార్టీ ఇచ్చిన పదవీ బాధ్యతలను ఎవరు పరిధిలో వారు నిర్వహించాలని, అందుకు భిన్నంగా పరిధి దాటి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే అధికారం, పరిధి ఎవరికి లేవని తెలిపారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రస్తుత తరుణంలో పార్టీ ఆమోదం లేకుండా స్వయం ప్రకటిత నాయకులు సొంతంగా కార్యక్రమాలు రూపొందించుకుంటూ పార్టీని గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశారు. ఇచ్చిన పదవీ బాధ్యతలకు భిన్నంగా పరిధి దాటి పార్టీ భవిష్యత్తు ప్రయోజనాలను దెబ్బతీసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com