Logo
Date of Publish : 08 September 2023, 9:31 pm
Editor : Sake Naresh

మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ విజయసంకల్ప యాత్ర

            ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ రేపటి నుంచి 09-09-2023 పల్లె పల్లెలో జనసేన పార్టీ విజయసంకల్ప యాత్ర అనే పేరుతో ధర్మవరంలో వైసీపీని గద్దె దించేందుకే ఈ యాత్రను చేపడుతున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాలను,అక్రమాలను తెలియజేసి ప్రజల్ని చైతన్యవంతులని చేస్తామని తెలియజేశారు. అనంతరం ఇటీవల వైసీపీ వాళ్లు సాలమ్మ అనే వృద్ధురాలు వారి వీధిలో కేతిరెడ్డి రోడ్డు వేయలేదని ప్రశ్నించినందుకు పెన్షన్ తీసివేయడంతో ఆవిడ న్యాయస్థానానికి వెళ్లిన వెంటనే అధికారులు పెన్షన్ ఇవ్వడం ఎంతో సంతోషమని ఇది జనసేన పార్టీ విజయంగా భావిస్తున్నామని అధికారులు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యాం కుమార్,జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు,కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు బండ్ల చంద్రశేఖర్,ఎం.మోహన్, దాము మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com