ఆగిపోయే స్థితిలో ఉన్న పేద కుటుంబ పెళ్ళికి రూ.1,00,000 సహాయం చేసి దాంపత్య జీవితాన్ని కాపాడిన జనసేన పార్టీ వీర మహిళ విలాసిని ( నిషి రెడ్డి )
ఎక్కడ ఏం ఆపద వచ్చినా సహాయం చేయడానికి జనసైనికులు, వీర మహిళలు అండగా ఉంటారనడానికి ఇదొక నిదర్శనం. హైద్రాబాదులో పేద కుటుంబం వధువు స్రవంతి వివాహాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. వధువుకి తండ్రి కూడా లేడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ వీర మహిళ విలాసిని ( నిషి రెడ్డి ) గారు తన వంతు సహాయం చేశారు. తాను మరో అవసరం నిమిత్తం దాచుకున్న డబ్బులని ఆలోచించకుండా వధువు తల్లికి రూ. 1,00,000 సహాయంగా అందించింది. విశేషం ఏమిటంటే విలాసిని ( నిషి రెడ్డి ) మాట్లాడుతూ నా పుట్టిన రోజు సందర్భంగా ఒక వధువు పెళ్ళికి సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు స్ఫూర్తి అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఒక దాంపత్య జీవితాన్ని కాపాడిన నిశి రెడ్డికి సోషల్ మీడియాలో అందరూ ధన్యవాదములు తెలుపుతున్నారు.