శ్రీకాకుళం (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో వున్న గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న చదువుకొన్న వారు ఉద్యోగాలు లేక, రిజర్వేషన్లు తగ్గడం వలన యువత వెనకపడి ఇంటికి పరిమతం అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు కొత్తకోట నాగేంద్ర గారి ఆధ్వర్యంలో వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లోకి నేరుగా వెళ్లి యువతకి అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. వారు ఉద్యోగానికి కానీ, ఆర్మీకి వెళ్లిన, దరఖాస్తుకి నగదు చాలకపోయిన, గ్రామంలో సమస్యలు ఉన్నా, మీకు ఎప్పుడు జనసేన పార్టీ అందుబాటులో ఉంటుంది. మరియు భావితరాల భవిష్యత్ కు జనసేన పార్టీ ఒక పునాది పార్టీ అని కార్యకర్తలు అన్నారు. వాళ్లతో గ్రామములో ఉన్న సమస్యలు అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మల్లేశ్వరావు, అంపిలి, విక్రమ్, గేదెల, వాసు, రుద్ర, ప్రదీప్, తులాగాపు మౌళి, దూబ సంగంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com