గిరిజనుల పోరాటానికి మద్దతుగా జనసేన పార్టీ

• మన హక్కులను కాలరాస్తున్న వైసిపి పెత్తందారులను ఎదురించండి. గునుకుల కిషోర్

      నెల్లూరు, (జనస్వరం) : వీరంపల్లి గ్రామంలో తొమ్మిది సంవత్సరాలుగా చిట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న భానుచందర్ అనే గిరిజన వ్యక్తిని అకారణంగా పదవి నుంచి తొలగించడానికి నిరసిస్తూ గిరిజన సంఘం నాయకులు ఏపీ ట్రాన్స్కో, దర్గా మిట్ట కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. వారికి జనసేన పార్టీ తరపున జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సర్వేపల్లి నాయకులు బొబ్బేపల్లి సురేష్ పోరాటాలకు మద్దతుగా నిలిచారు. నాలుగు గంటలు నిలవరింపు అనంతరం ఎస్సీ వారి దగ్గరకు వచ్చి ముగ్గురు డిఈల సమక్షంలో విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుడిని పదవి నుంచి తొలగించి నెల రోజులైనా, పలుమార్లు వారిని హెచ్చరించినా లాభం లేకుండా పోయిందని గిరిజన సంఘాల నాయకులు బలంగా ఒత్తిడి తెచ్చారు. వారం రోజుల వ్యవధిలో రిపోర్టు పై అధికారులకు పంపించి చర్యలు తీసుకుటాం అన్న హామీతో వారం గడువుపై నిరసనలు ఆపారు.

   ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ నోరు లేరు వారు అని బలహీన వర్గాలకు చెందిన వారిని గిరిజనుల పొట్ట కొట్టడం అమానుషం, స్థానిక వైసిపితందారుల ఒత్తిడితో గిరిజనుడి విధులు నుంచి తొలగించడం అమానుషమైన చర్య. ఈ పోరాటానికి జనసేన పార్టీని తరఫున మేమంతా మద్దతుగా నిలుస్తాం,గిరిజనులను చిన్నచూపు చూస్తున్న వైసిపి ప్రభుత్వానికి, కాకాని కి ఈసారి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలి. మన హక్కుల కోసం వానను సైతం లెక్కచేయకుండా పోరాడిన గిరిజన సోదర, సోదరీమణులకు పేరుపేరునా నమస్కారాలు తెలుపుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపినట్లు పోరాడితే పోయేదేమీ లేదు ఎదవ బానిస సంకెళ్లు తప్ప గిరిజన సోదరుడికి న్యాయం జరిగే వరకూ ఇందాక గిరిజన సోదరుడు తెలిపిన విధంగా ప్రాణత్యాగానికైనా మేము సైతం సిద్ధమని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు నాగబాబు గారు, మనోహర్ గారు అజయ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు కూడా జనసేన పార్టీ తరఫున మద్దతుగా నిలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంఘం నాయకులు పెంచలయ్య,చెంచయ్య, సాంబయ్య తదితర గిరిజన నాయకులు ఉషారాణి, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సర్వేపల్లి నియోజకవర్గం బొబ్బేపల్లి సురేష్, సుదా మాదవ్, ప్రశాంత్ గౌడ్,షాజహాన్, కేశవ, హేమచంద్ర యాదవ్,బన్నీ,వర,ఖలీల్, ఇశాఖ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way