తెలంగాణ, (జనస్వరం) : పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు పద్మశ్రీ. మొగులయ్యకి గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అధినేత అడుగుజాడల్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ కిన్నెర మొగులయ్య గారికి తమ ఇళ్ళు నిర్మించుకునే సమయంలో జనసేన తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం తరపున తగిన సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వంగ లక్ష్మణ్ గౌడ్ ని మనఃపూర్వక అభినందించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం కిన్నెర కళాకారుడు మొగులయ్యని తన నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి వారికి 100 సంచుల సిమెంట్ మరియు 25,000 (ఇరవైదు వేల) రూపాయల ఆర్థిక సహాయన్నీ అందజేశారు. ఈ సందర్భంగా వంగ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడిన సందర్భంగా శ్రీ మొగులయ్య గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల సహాయాన్ని చాలా సంతోషకరమైన విషయం అని అభినందించారు.అదే విధంగా మొగులయ్య గారికి పద్మశ్రీ బిరుదు రాకముందు నుంచే జనసేన పార్టీ వారికి అండగా ఉంది అని అన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయం నందు మొగులయ్య గారిని పిలిపించి మర్యాదపూర్వకంగా సత్కరించి 2లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అని పేర్కొన్నారు. అధినేత అడుగుజాడల్లో ఎల్లప్పుడూ ఉంటాము. మాకు తోచినంత ప్రజలకు మేము సహాయం చేస్తుంటాము అని అన్నారు! ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రేచర్ల శేఖర్, బైరపోగు సాంబ శివుడు, నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు జానీ, బారిగారి రాజేందర్, సూర్య, జెర్రిపాటి చంద్ర శేఖర్, కోడిగంటి సాయి, కురుమన్న, తదితర జనసైనికులు పాల్గొన్నారు.