
పాయకరావుపేట, (జనస్వరం) : నక్కపల్లి మండలం చిన్నతీనార్ల గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలిపోవడంతో, జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది. శివదత్ మాట్లాడుతూ గతంలో కూడా ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యే తక్షణమే జగన్ ప్రభుత్వం ఇళ్ళు నిర్మిస్తుంది అని అబద్ధపు వాగ్దానాలు చేశారు. ఇలా ఎంత కాలం ప్రజలను మోసం చేస్తారు? ఇప్పటికైనా తక్షణమే స్పందించి బాధితులకు నష్ట పరిహారం చెల్లించి గృహ నిర్మాణం చేపట్టకపోతే తీవ్ర స్థాయి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిక్కి మహేష్, ప్రసన్న కుమార్, ఆనంద్, తాతాజీ, రాజేష్, మైలపల్లి గిరీష్, జగ్గ, బడే శ్రీను, చిట్టిబాబు, గోపి, అల్లాడ రమణ, గణేష్, రాజు బంగారి, అనిల్, కోసురు రాజు, పండు, పి సతీష్, ఎల్ దుర్గ, పి స్వామి, కురందాసు అప్పలరాజు, మరియు నక్కపల్లి మండల, ఎస్ రాయవరం మండల జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.