చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని గత 3 సంవత్సరాలుగా పోరాడుతున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, శ్రీకాళహస్తికి సమీపంలో వున్న సుగర్ ఫ్యాక్టరీ సుడలగుంట సుగర్స్ లిమిటెడ్ – B.N. కండ్రిగ యాజమాన్యం నుండి 2000 మంది రైతులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 56 కోట్లు రూపాయిలు రైతుల బకాయిలు చెల్లించకుండ యాజమాన్యం జయరామ్ చౌదరి ప్రభుత్వ పెద్దల అండదండలతో రైతులను మోసం చేస్తున్నారని, 3 జిల్లాల రైతులు రేణిగుంట చెక్ పోస్ట్ వద్ద నిరసన తెలియజేయడానికి జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి వినుత కోటా గారు మద్దతు తెలిపి వారితో పాటు నిరసనలో పాల్గొన్నారు. నిరసన తెలియజేస్తున్నరైతులను పోలీస్ లు అరెస్ట్ చేసి రేణిగుంట పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లడాన్ని ఖండిస్తూ రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని వారికి బరోసా ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు వారం రోజుల్లో యాజమాన్యం పై చర్యలు తీసుకుని రైతుల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారు, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గారు స్పందించి రైతులకు న్యాయం చేయాలని వినుత కోటా గారు డిమాండ్ చేయడం జరిగింది. వారం రోజుల్లో రైతులకు న్యాయం జరగని పక్షాన జనసేన పార్టీ 3 జిల్లాల నాయకులు కార్యకర్తల తో కలిసి పోరాటం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా రైతులకు బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు రాజా రెడ్డి, మునికుమార్, త్యాగరాజు , జ్యోతి మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.