కర్నూల్, (జనస్వరం) : హాజీరా న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కేంద్రంలో అన్ని ప్రజాసంఘాలు కలిసి చేస్తున్న న్యాయ పోరాట దీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మెన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రేఖగౌడ్ గారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రేఖగౌడ్ గారు మాట్లాడుతూ అత్యాచారానికి గురై ఏడాది అవుతున్న నిందితులను పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వ యంత్రంగం ఘోరంగా విఫలమైందని తెలిపారు. గోనెగండ్ల మండల పరిధిలోని ఎర్రాబాడు గ్రామానికి చెందిన హాజీరాను పట్టపగలు అత్యాచారం హత్య చేసి ఆగస్టు నెలతో ఏడాది అవుతున్న న్యాయం జరగకపోవడం సిగ్గుచేటన్నారు. బాధిత కుటుంబం న్యాయం కోసం ధర్నాలు, దీక్షలు చేస్తూ నిరంతరం పోరాడుతున్న, కేసు దర్యాప్తులో మాత్రం చలనం లేదన్నారు. ఒక సామాన్య కుటుంబం పడుతున్న కన్నీటి రోదనలు కనపడని ప్రభుత్వానికి గొప్పగా చెప్పుకొనే దిశ చట్టాలు ఎందుకని ప్రశ్నించారు. చట్టం న్యాయస్థానాలు ఉన్న అవి కఠినంగా లేకపోవడంతోనే నిందితులు తప్పించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిందితులను గుర్తించి హాజీరా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మండల జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేసిన కదలికలు రాలేదని న్యాయం జరిగే వరకు ఆగిపోయే ప్రసక్తేలేదని అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేద్దామని కుటుంబసభ్యలు అధైర్యపడొద్దని న్యాయం జరిగే వరకు కలిసి పోరాడుదమని జనసేనపార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com