కుమ్మెర గ్రామ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ మద్దతు

కుమ్మెర

• కుమ్మెర గ్రామ భూ నిర్వాసితులకు అదనంగా లక్ష రూపాయలు చెల్లించాలని రైతుల డిమాండ్

• కలెక్టర్ గారి ఎ. ఒ శ్రీధర్ గారికి వినతి పత్రం అందజేసిన శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ గారు

• ఇంటికో పెద్ద కొడుకుని అని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే గారు మాటలు చెప్పి గాలికొదిలేసారు…

• కాలేశ్వరం ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన రైతులకు ఒక న్యాయం…? *పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఇంకో న్యాయమా …??

• పాలమూరు జిల్లా రైతుల పట్ల సవతి ప్రేమ ఎందుకు చూపిస్తుంది ఈ యొక్క ప్రభుత్వం….?
అభివృద్ధి అంటే ఇదేనా…???

– వంగ లక్ష్మణ్ గౌడ్ 

        నాగర్ కర్నూల్ ( జనస్వరం ) : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో కుమ్మెర గ్రామంలోని రైతుల భూములు తీసుకొని ఎకరానికి కేవలం నాలుగున్నర లక్షల రూపాయలు ఇచ్చారు. అదనంగా ఇస్తానన్న లక్ష రూపాయలు ఇవ్వలేదని గ్రామ భూ నిర్వాసితులు ఇటీవలే… వంగ లక్ష్మణ్ గౌడ్ గారికి వినతి పత్రం అందజేయటం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు గ్రామ భూ నిర్వాసితులతో కలిసి, రైతుల పక్షాన నిలబడేందుకు, గ్రామంలోని భూ నిర్వాసితులకు అదనంగా చెల్లిస్తనన్న లక్ష రూపాయలు చెల్లించాలని వంగ లక్ష్మణ్ గౌడ్ గారు కలెక్టర్ గారి ఎ. ఒ శ్రీధర్ గారికి వినతి పత్రం అందజేయటం జరిగింది. ఇందులో భాగంగా లక్ష్మణ్ గౌడ్ గారు మాట్లాడుతూ కుమ్మెర గ్రామ భూనిర్వాసితులకు అండగా వారికి న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుంది..  గతంలో ఎకరానికి కేవలం నాలుగన్నర లక్షల రూపాయలు ఇచ్చారు. వారికి అదనంగా చెల్లిస్తానని చెప్పిన లక్ష రూపాయలు చెల్లించాలి అని రైతులు డిమాండ్ చేయడం జరిగింది.  నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పిన నాగర్ కర్నూల్ స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి,,, అధనంగా లక్ష రూపాయలు ప్రకటించగలరని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు బైరపోగు సాంబ శివుడు, రాకేష్ రెడ్డి, జనసేన పార్టీ నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు మహేష్ గౌడ్, సూర్య వంశీ రెడ్డి, అరిఫ్, రాజు నాయక్, బోనాసి లక్ష్మణ్, ఎదుల శివ, నాగరాజు, హీమావర్ధన్, విజయ్, సంతోష్, చంద్రశేఖర్, కురుమూర్తి, రాము, తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way