Logo
Date of Publish : 12 July 2022, 3:42 pm
Editor : Sake Naresh

పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికులకు జనసేనపార్టీ మద్దతు

     పుట్టపర్తి, (జనస్వరం) : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు పుట్టపర్తి మున్సిపల్ కార్మికులకు జనసేన నాయకులు మద్దతు తెలపారు. ఓడీసీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిస్కారం చెయ్యాలని పుట్టపర్తి మున్సిపాలిటీలో పని చేస్తున్న 6 మంది కార్మికులకు 22 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వెంటనే వారికీ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేరుకు మాత్రమే జిల్లా అని అభివృద్ధి మాత్రం శూన్యం అని పుట్టపర్తి మున్సిపాలిటీకి నిధులు తేవడంలో పుట్టపర్తి ఎమ్మెల్యే విఫలం అయ్యారని, అలాగే మున్సిపల్ చైర్మన్ కి కమిషన్ ల మీద ఉన్న శ్రద్ద పుట్టపర్తి అభివృద్ధిపై లేదని దుయ్యపట్టారు. వైసీపీ నాయకులు కార్మికుల సమ్మెకు ఇతర పార్టీ నాయకులు మద్దతు ఇవ్వకూడదు అని కార్మికులకు బెదిరింపులు పెట్టడం వారి చేతగాని తనానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు అల్లాడి జయరాం, పూల శివ ప్రసాద్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు గందోడి సతీష్, నాయకులు మారుతీ, వెంకటేష్, ఆది శేషు, సల్లప్ప, పవన్ కళ్యాణ్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com