
మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి సాధన సమితి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్షం సభ్యులు మదనపల్లిని జిల్లా చేయాలని పోరాటం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయిన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గారు మాట్లాడుతూ అన్ని మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా గా ప్రకటించాలని కోరారు. అసలే రాష్ట్రం లోటు బడ్జెట్ తో అప్పులపాలై అరకొర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దానిని పరిపాలన అంటూ తన భుజం తట్టుకుని సంబర పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఖజానా ఖాళీ అయిన ఈ సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా చేస్తారని వాటిని ఎలా అభివృద్ది చేస్తారని ప్రభుత్వాని ప్రశ్నించారు. కనీసం వృద్ధులకు జీతాలు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదని… ఎన్నికలు సమయంలో కేంద్ర ప్రభుత్వాని నిలదీసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని తెస్తామని అన్నారు. ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన హామీలను వమ్ము చేస్తూ కొత్తగా జిల్లాల ఏర్పాటు విషయం తెరపైకి తేవడం హాస్యాస్పదం అన్నారు.