Logo
Date of Publish : 11 October 2021, 4:24 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

              కడప ( జనస్వరం ) :  రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని స్థానిక మిషన్ పాఠశాల లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర 49వ జన్మదినం పురస్కరించుకొని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు చిట్వేల్ మండల జనసైనికులు మాదాసు నరసింహ, హరి రాయల్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో భాగంగా రక్షణ బ్లడ్ బ్యాంక్ వారి పర్యవేక్షణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 35 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, నాపై అభిమానంతో జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా మాదాసు నరసింహ మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుని కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాగేంద్ర అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కలియుగ వైకుంఠ నాథుని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నామని ఈ సందర్భంగా చిట్వేలు మండలం జనసేన తరపున ఆయన తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com