బొబ్బిలి, (జనస్వరం) : మైతాన్ ఫ్యాక్టరీ కార్మికులపై జరిగిన లాఠీ ఛార్జి, అక్రమ అరెస్టులను జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన కార్మికుల గ్రామాలు అయిన ఎమ్.బుర్జవలస, పణుకువలస, గున్నతోటవలసలో పర్యటించి వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది. కార్మికులను నిర్దాక్షిణీయంగా మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ లాక్కెళ్లి అరెస్టు చెయ్యడం దారుణమని అన్నారు. పసిపిల్లల తల్లులు అని కూడా చూడకుండా కనీసం పిల్లలను కూడా కలవనివ్వకుండా అరెస్టు చేసి ఎక్కడో విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పెట్టడం శోచనీయం అని అన్నారు. ఇప్పటికి 14 రోజులు అవుతున్నా బెయిల్ రాకుండా చేస్తున్నారు అని వారి బాధలను చెప్పారు. బాబు పాలూరు మాట్లాడుతూ కార్మికులు కడుపు మండి వారికి రావాల్సిన బకాయిలు, వారి ఉద్యోగాలను అడిగితే ఇలా చేస్తారా అని స్థానిక MLA, మంత్రి, జడ్పీటీసీ చైర్మన్ వీరంతా ఏమి చేస్తున్నారని, మహిళలు అని చూడకుండా అరెస్టు చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ పసిపిల్లలు తమ తల్లి లేకుండా ఎలా ఉంటారని మీరు చేసుకుంటారా అని పేర్కొన్నారు. ఈరోజు హియరింగ్ ఉంది కానీ కరోనా అని చెప్పి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా చూపించి మళ్ళీ వాయిదా పడేలా చేస్తారా అని వీళ్ళు పేదలు కాబట్టి ఇలా చేస్తున్నారా! మీకు మీ ముడుపులు అందించే వారికి మీ ప్రభుత్వం పని చేస్తుందా! అని పేర్కొన్నారు. అలాగే తక్షణమే వారికి బెయిల్ వచ్చేలా చెయ్యాలని లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని జనసేన పార్టీ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటీ విభాగం సభ్యులు సతీష్, బొబ్బిలి నాయకులు గంగాధర్, రాజా, శ్రీను,గణేష్, వెంకటరమణ, సత్యనారాయణ, రవి, గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు.