హైదరాబాద్, (జనస్వరం) : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఐటీ విభాగం ఛైర్మన్ మిరియాల శ్రీనివాస్ తో రాష్ట్ర ఐటీ విభాగం కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఐటీ విభాగం కో ఆర్డినేటర్ లు కలవడం జరిగింది. భవిష్యత్ లో పార్టీకి ఐటీ విభాగం సేవలు ఎలా అందించగలం 2024 లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఎలా పని చేయాలి అని దిశా నిర్దేశం చేయటం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట ఐటీ కమిటీ సభ్యులు వుయ్యాల శ్రీనివాస్, పసుపులేటి వెంకట సంజీవ, చవ్వాకుల కోటేష్, సుధీర్, జి క్రిష్ణ మోహన్, జిల్లా కో ఆర్డినేటర్ లు సల్లా గవాస్కర్, వెంకటేష్ యాపరాల, నక్కల శివ క్రిష్ణ, శ్యామ్ సుందర్, లక్ష్మీకాంత్ రెడ్డి, గాలిదేవర తామేష్, వివేక్ నేరుసు, రవి క్రిష్ణ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com