
విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారు తలపెట్టిన గ్రామ గ్రామాన జనసేన కార్యక్రమాన్ని విజయనగరం నియోజవర్గంలో చెల్లూరు గ్రామంలో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే చెల్లూరు గ్రామంలో జనసేన నాయకులు బోబ్బాది చంద్ర నాయుడు ఇంటింటికి జనసేన సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచిపెట్టి అనంతరం గ్రామ గ్రామాన కార్యక్రమంలో భాగంగా పాలవలస యశస్వి గారు ప్రజాధర్భార్ నిర్వహించారు. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ, అర్హులైన కొందరికి ప్రభుత్వ పథకాలు అందని వారినుంచి వినతులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ వైస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతున్నారని, వారు చెప్పినట్లు చేయకపోతే పెన్షన్లు, ఇల్లులు ఆపేస్తామని బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వంపై ఏ సమస్యలపైనైనా పోరాడడంలో జనసేన పార్టీ చేయడాన్ని చూసి ప్రజలందరి చూపు జనసేన వైపు ఉందని, ప్రజలందరూ భవిష్యత్ లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొబ్బాది చంద్ర నాయుడు, ఎజ్జాడ సాయి, సత్తిబాబు, స్వామి, నాయుడు, సాయి, మురళి, నాగరాజు, శ్రీను, శ్రావణ్, సూరిబాబు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.