
ధర్మవరం, (జనస్వరం) : ధర్మవరం పట్టణంలో వంద సంవత్సరాల నుంచి ఉన్న మార్కెట్ ను కూలదోసి ప్రభుత్వ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, ఎమ్మెల్యేకి అనుకూలంగా పని చేస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు. మార్కెట్లో వ్యాపారస్తులకు జనసేనపార్టీ అండగా ఉంటుందన్నారు. ధర్మవరం పట్టణం మార్కెట్ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చిలకం మధుసూదన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ నిరసనగా అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ I.A.S గారిని కలిసి వారికి వినతిపత్రం అందజేసి మార్కెట్ వినియోగదారులకు అనుకూలంగా చట్ట ప్రకారంగా నడుచుకుని వారికి న్యాయం చేయవలసిందిగా యధావిధిగా వారి వ్యాపారం కొనసాగించాలని టెండర్లు పిలిచిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అలాగే లబ్ధిదారుల మీద భారం తగ్గిస్తూ పేద, మధ్య తరగతి వ్యాపారస్తులకు అనుగుణంగా ఉండేటట్టు చేయాలని జాయింట్ కలెక్టర్ గారితో చిలకం మధుసూదన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, CPI నాయకులు జంగాలపల్లి పెద్దన్న, CPM నాయకులు పోలా లక్ష్మీనారాయణ, APMRPS జిల్లా అధ్యక్షుడు తుంపర్తి పరమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.