
ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన దాసరి అనీల్ అనే వ్యక్తి 5నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలునూ కోల్పోయాడు. కనీసం సొంత ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబ వివరాలు స్థానిక జనసేన పార్టీ కార్యకర్త అజయ్, సత్యల ద్వారా విషయాన్ని తెలుసుకున్న జనసేనపార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భవానీ రవికుమార్ గారు ఆమిద్యలా గ్రామంలో ఉరవకొండ జనసైనికులతో కలసి బాధితున్ని పరామర్శించి, తక్షణ ఖర్చుల నిమిత్తం 10 వేలరూపాయలను వారికి ఇచ్చి, ప్రతి నెలా 10 వేల రూపాలు అలా సంవత్సరం పాటూ అందిస్తామని హామి ఇచ్చారు. అలాగే ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబానికి చాలా రోజులుగా నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. జనసేన పార్టీకి, జనసైనికులకు రుణపడి ఉంటామని వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రాపా ధనుంజయ్ గారు, హుస్సేన్, కాలేషా మరియు ఉరవకొండ జనసైనికులు పాల్గొన్నారు.