
కాకినాడ, (జనస్వరం) : కరప మండలం పెదకొత్తూరు గ్రామంలో గత సంవత్సరం జరిగిన జాతరలో వైసీపీ నాయకులు కక్షతో స్థానిక జనసైనికులపై అక్రమ కేసులు బనాయించగా కోర్టు వారి కేసుని కొట్టివేసిన కారణంగా, జనసైనికుల తండ్రులు, జనసేన పార్టీ పెద్దలు కలిసి కాకినాడలో జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఆనాడు జనసైనికులకు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడి, దైర్యం చెప్పినందులకు ధన్యవాదములు తెలియచేసిన జనసైనికులు. వారందరికీ నానాజీ అభినందనలు తెలుపుతూ, జనసైనికులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన జనసేన పార్టీ అండగా నిలుస్తుంది అని చెప్పడం జరిగింది.