ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం బైరిశాస్త్రల పేట గ్రామంలో దాడిలో గాయపడ్డ దళితులను పరామర్శించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు. ఇటీవల భూతగాధాలు నేపథ్యంలో గాజుల కొల్లివలస అధికార పార్టీ నేత బైరి శాస్త్రుల పేటకు చెందిన బండారి మంజు అనే దళిత మహిళపై కులం పేరుతో దూషించడమే కాకుండా దాడి చేయడంతో వారిని పరామర్శించి జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అలాగే దాడికి కారణమైన దోషులను వెంటనే శిక్షించి బాధితులకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను కోరారు. అలాగే దళితులపై ఎన్నో చట్టాలు చేసినప్పటికీ అధికార పార్టీ నాయకుల అండదండలతో దళితుల మీద దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com