వరంగల్, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ గారి ఆదేశాల మేరకు ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి(ACPS) తలపెట్టిన మహాపాదయాత్రకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఏర్పడ్డాక ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చి మోసం చేసారు. ఈ ప్రభుత్వం ఆర్య వైశ్యులను కేవలం ఎన్నికలలో ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది అని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆర్య వైశ్యులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలు కొన్ని నెలల పాటు మూసివేసి ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి ఆర్య వైశ్యులను ముఖ్యమంత్రి మోసం చేయడం సిగ్గు చేటు, ఈ పాదయాత్ర కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు పొందుపర్చిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. లేనిచో రాబోయే రోజుల్లో ACPS ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. భవిష్యత్ లో ఆర్య వైశ్య పోరాట సమితికి ఆకుల సుమన్ గారి ఆధ్వర్యంలో వరంగల్ జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.