
జనగామ, (జనస్వరం) : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గములో జనసైనికులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వి పిలుపునిచ్చారు. డివిజన్ కేంద్రంలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రశ్నించేతత్వం అలవర్చుకుని ప్రజల పక్షనా నిలబడి సమస్యలపై పోరాడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలపై జనసేన నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. పార్టీని జనంలోకి తీసుకెళ్తూ క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే దిశగా జనసేన పార్టీ ఎదిగే అవకాశాలు ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు శేషాద్రి సందీప్, మహమ్మద్ రజాక్, మునిగేలా పవన్, మిడిదే ప్రశాంత్ రెడ్డి, చుక్క నవీన్, సాంబ శివ, మహమ్మద్ బషీర్, రోహిత్, ఉదయ్, విజయ్, ప్రశాంత్, రాకేష్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.