Logo
Date of Publish : 12 December 2022, 4:36 pm
Editor : Sake Naresh

గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలి : సుంకరి అప్పారావు

          శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసిందని కరణం కళావతి తెలిపారు. మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగా జన సైనికులు ఆకుల సీతంపేట గ్రామంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు సుంకరి అప్పారావు, జనసేన పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జొన్న పల్లి సత్తిబాబు, అధ్యక్షతన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గ స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఏ వింధంగా ముందుకు వెళ్లాలి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తగిన సూచనల గూర్చి వారు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. వేపాడ మండలంలో రైతు పంట పండించాలంటే వర్షాధారంపై ఆధార పడవలసి వస్తుందని, ఏ ఒక్క రైతు ధాన్యం సంవత్సరానికి మూడు పంటలు వేయలేదని, ఆడబిడ్డలకు వివాహం చేయాలంటే పొలం అమ్ముకొని వివాహం చేయవలసిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉందని మండల పార్టీ అధ్యక్షులు సుంకర అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు, నక్కరాజు సత్యారావు, రామకోటి, వీరవనితలు అడపా కళ్యాణి సగ్గుబిండి వెంకటలక్ష్మి, జనసైనికులు కోల మధు, రుద్ర నాయుడు, రామిళ్ళ శివాజీ, అలమండ రాంబాబు, రావాడ నాయుడు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com