ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని గారు, జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు, ఉయ్యాల ప్రవీణ్ గారు, బొబ్బేపల్లి సురేష్ గారు, జనసేన పార్టీ వీర మహిళలు కోలా విజయ లక్ష్మి గారు, ఇంద్రా రెడ్డి గారు, శిరీష రెడ్డి గారు, అనిత గారు నియోజకవర్గ జన సైనికులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో జనసైనికులు ఎంతో ఉత్సాహంతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులందరూ ఆత్మకూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలైన చుక్కల భూముల సమస్య, నియోజకవర్గంలో పూర్తికాకుండా నిలిచిపోయిన పలు ప్రాజెక్టులైన, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకం, సంగం బ్యారేజీ, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గము, సోమశిల జలాశయం మరమ్మతులు, సమగ్ర సోమశిల అమలు ద్వారా నియోజకవర్గంలోని చెరువులు అన్నింటికీ సోమశిల నీరు అందించే సమగ్ర సోమశిల పథకం, చేయాలని మరియు నియోజకవర్గ యువత ఉపాధి అకాశాలు మెరుగు పరిచే విధంగా పారిశ్రామికీకరణ చేపట్టాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు, వీరమహిళలు తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com