
మదనపల్లి, (జనస్వరం) : మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రోజు నుండి ఈ రోజు వరకు పలు రకాల నిరసన కార్యక్రమాలు మదనపల్లెలో చేపట్టారు. ఈ కార్యక్రమాలకు జనసేన అదే విధంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికుతున్నారు. ఈ రోజు మదనపల్లి జిల్లా కోసం BSP రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్, జనసేన వివిధ రాజకీయ పార్టీలు బస్టాండ్ లో ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే జనసేనపార్టీ ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. దీనిని నిరసిస్తూ మదనపల్లి జిల్లా సాధన జేఏసీ సభ్యులు, బందరు గౌతం తన స్వగృహంలోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగినది. మదనపల్లి జిల్లాగా ప్రకటించి అంతవరకు మదనపల్లె జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా నిరాహార దీక్ష చేపట్టిన బందెల గౌతమ్ కు జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత సంపూర్ణ మద్దతు ఇస్తూ దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జిల్లా జేఏసీ సభ్యులు, జిల్లా సాధన జేఏసీ సభ్యులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు.