
శేరిలింగంపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లికల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు నానాటికీ మర్చిపోతున్న నేటి యువత రంగవల్లికల ఆవశ్యకత గురించి తెలియచేసి ముగ్గులలో ఒక సైన్స్ దాగి ఉన్నదని అది ఏకాగ్రతకు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని తేలియచేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు గా పాల్గొన్న సుజాత కాజా, ప్రభావతి గార్లు మాట్లాడుతూ మహిళలు రాజకీయం ముందుకు ఎదగటానికి జనసేన పార్టీ ఒక గొప్ప వేదిక అని సమాజంలో ఉన్న సమస్యలపై రాజకీయ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రంగ వల్లికల పోటిలో పాల్గోన్న మహిళలందరికి బహుమతులు అందజేసి నియెజకవర్గ ప్రజానీకానికి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసారు.