నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణం లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనసేన నాయకులు భాస్కర్, చినబాబు లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీ కూటమి విజయం సాధించడం తధ్యమని పేర్కొన్నారు. స్థానిక సమస్యలను పట్టించుకొని పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. అలాగే నివర్ తుఫాను వలన నష్టపోయిన రైతులకు ఎకరాకు 35000 చెల్లించాలని, లేకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో త్వరలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా హిందూ దేవాలయాల భద్రత లేదని, రథం కాల్చివేత విగ్రహాల ధ్వంసం జరుగుతుందని, మద్యనిషేధం చేస్తామని గెలిచిన ప్రభుత్వం రెట్టింపు ధరలతో మధ్య ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు అని తెలియజేశారు. అప్పు చేసి పప్పు కూడు తప్ప, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువయ్యాయి అని తెలిపారు. సామాన్య మధ్య తరగతి ప్రజల నడి విరుసుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పృద్వి, శివరామిరెడ్డి, ప్రసాద్, కుళ్ళాయి, నాగేశ్వరెడ్డి, ఖాసీం, పవన్, శంకర్, సంజీవ, సుధాకరెడ్డి, అబ్దుల్ పాల్గొన్నారు.