Logo
Date of Publish : 11 October 2020, 2:26 pm
Editor : Sake Naresh

అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

             అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం చల్లపల్లి వాసుల దశాబ్దాల కల ఫైర్ స్టేషన్.. జనసేన పార్టీ అధ్వర్యంలో ఫైర్ స్టేషన్ కొరకు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన దీక్ష చెయ్యడం జరిగింది.. ఎన్నో సంవత్సరాల నుండి చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో అగ్నిప్రమాదాలు జరిగి భారీగానే ఆస్తినష్టం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉన్న చల్లపల్లి మండలంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వలన ప్రతియేటా అగ్నిప్రమాదాలు జరిగి కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నష్టపోవాల్సివస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో జరుగుతున్న అగ్నిప్రమాదాల వలన అనేక కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నారు. అగ్నిప్రమాదానికి గురైన గృహాలు, వరిగడ్డి వాములు క్షణాల్లో అగ్నికి ఆహుతి అవుతున్నాయి. కాలి బూడిద అవుతున్నాయి. చల్లపల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే ఇటు అవనిగడ్డ నుండి, లేకపోతే అటు మొవ్వ నుండి, అది కూడా లేకపోతే మచిలీపట్నం నుండి అగ్నిమాపక వాహనం రావాల్సిఉంటుంది. అవి సంఘటనా స్థలానికి చేరుకునేందుకు గంటల సమయం పడుతుండటంతో ఈలోగానే ప్రమాదానికి గురైన గృహాలు కాలి బుడిదై ప్రజలు కట్టుబట్టలతో మిగులుతున్నారు. ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి నారాయణరావు నగర్ లో స్థలం కేటాయించినప్పటికీ, నిర్మాణం మాత్రం ఆచరణకు నోచుకోలేదు. ఈ సమస్యను పరిష్కరిస్తామని అటు అధికారులు, ఇటు నాయకులు హామీలు ఇవ్వడమే కనిపిస్తుంది కానీ, ఈ విషయంలో చల్లపల్లి మండలం పూర్తిగా నిరాదరణకు గురవుతుంది.ఈ దీక్ష కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మచిలీపట్నం జనసేన ఇంచార్జి బండి రామకృష్ణ, రాయపూడి వేణుగోపాల్, లంకిశెట్టి బాలాజీ, రంజిత్ కుమార్ మడమల, నెరుసు కృష్ణాంజనేయులు, విమల్ కృష్ణా, బొచ్చు వెంకట్ నాధ్, నాగార్జున, సూదాని నందగోపాల్, మహేంద్ర, మేడా రామకృష్ణ, తోట సత్యనారాయణ, జగన్ కూరేటి, తోట మురళి కృష్ణా, సోమరౌతు నాంచారయ్య, కంతేటి శేఖర్, వీరబాబు, బొందలపాటి ప్రసాద్, లంకే సురేష్, రాజు, సాయి రాం, ఉస్మాన్ షరీఫ్, అలమల చందు, గాజుల శంకర్ రావు, మత్తి శివనంది, మచిలీపట్నం నాయకులు చౌదరి బాబు, మైఖేల్ మరియు ఆరు మండలాల జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com