Logo
Date of Publish : 13 September 2022, 4:39 am
Editor : Sake Naresh

ఖాదర్ బంగ్లా నుంచి మాచుపల్లి దాకా బ్రిడ్జి నిర్మాణం కోసం జనసేన పార్టీ నిరసన

         సిద్దవటం ( జనస్వరం ) :  సిద్దవటంలోని ఖాదర్ బంగ్లా నుంచి మాచుపల్లి దాకా బ్రిడ్జి లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జనసేన నాయకులు కొన్నేపల్లి శివకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కడపకి రావాలంటే బ్రిడ్జి లేక ఆ ఏరియా ప్రజలు సిద్దవటం మీదుగా దాదాపుగా 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. అదే బ్రిడ్జి నిర్మాణం చేస్తే గొల్లపల్లి, వంతాటిపల్లి, పొన్నవోలు, ఖాదర్ బంగ్లా, కొత్తపల్లి, జ్యోతి మొదలగు 15 గ్రామాలలోని ప్రజలకు 10 కిలోమీటర్లతో కడపకు చేరుకోగలరు. అక్కడ బ్రిడ్జి లేకపోవడం వలన విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. గతంలో ఎన్‌టి‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఆ తరువాత వై‌ఎస్‌ఆర్ గారు హామీ ఇచ్చి మరిచారన్నారు. కావున ప్రభుత్వం చర్య తీసుకొని ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, కొట్టే రాజేష్,శివకృష్ణ, ఆవుల నాగేంద్ర,బలబ్రహ్మయ్య, అతికారి సురేష్,హరి రాయల్, జనసైనికులు శ్రీనివాసులు, అజిస్, నాగమలయ్య, వెంకటేష్, అక్కడ ప్రాంత నివాసులు,తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com