
సిద్దవటం ( జనస్వరం ) : సిద్దవటంలోని ఖాదర్ బంగ్లా నుంచి మాచుపల్లి దాకా బ్రిడ్జి లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జనసేన నాయకులు కొన్నేపల్లి శివకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కడపకి రావాలంటే బ్రిడ్జి లేక ఆ ఏరియా ప్రజలు సిద్దవటం మీదుగా దాదాపుగా 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. అదే బ్రిడ్జి నిర్మాణం చేస్తే గొల్లపల్లి, వంతాటిపల్లి, పొన్నవోలు, ఖాదర్ బంగ్లా, కొత్తపల్లి, జ్యోతి మొదలగు 15 గ్రామాలలోని ప్రజలకు 10 కిలోమీటర్లతో కడపకు చేరుకోగలరు. అక్కడ బ్రిడ్జి లేకపోవడం వలన విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. గతంలో ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఆ తరువాత వైఎస్‌ఆర్ గారు హామీ ఇచ్చి మరిచారన్నారు. కావున ప్రభుత్వం చర్య తీసుకొని ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, కొట్టే రాజేష్,శివకృష్ణ, ఆవుల నాగేంద్ర,బలబ్రహ్మయ్య, అతికారి సురేష్,హరి రాయల్, జనసైనికులు శ్రీనివాసులు, అజిస్, నాగమలయ్య, వెంకటేష్, అక్కడ ప్రాంత నివాసులు,తదితరులు పాల్గొన్నారు.