కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ ప్రధాన కేంద్రంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు స్థానిక పంచాయతీలు ఎన్నికలు గురించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 6 మండలాలు జనసైనికులు హాజరు అవ్వటం జరిగింది. పంచాయతీ ఎన్నికలలో అవనిగడ్డ మండలంలోని 10 గ్రామ పంచాయతీలకు మరియు మిగిలిన 5 మండలాలు కలిపి మొత్తం 91 గ్రామపంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులును, అన్ని పంచాయతీలలో వార్డు మెంబర్స్ ను పోటీలో పెట్టడం జరుగుతుంది. అధికార వైస్సార్సీపీ, టీడీపీ పార్టీలకు ఢీటుగా అభ్యర్థులను ఎన్నికలలో పోటీ పెట్టి ఎక్కువ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు నంబర్స్ గెలుచుకుంటాం అని అన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాము అనీ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. సమావేశం అనంతరం సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు నుండి అర్జీలు తీసుకోవటం జరిగింది. రెండు మూడు రోజుల్లో అన్నీ పంచాయతీలలో పోటీచేసే అభ్యర్థులు నుండి సమాచారం తీసుకోని నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు గారి సమక్షంలో అభ్యర్థులు జాబితా ప్రకటించటం జరుగుతుంది. అన్ని గ్రామపంచాయతీలు ఎక్కువుగా యువత ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో నియోజకవర్గ ఇంచార్జి ముత్తంశెట్టి కృష్ణారావు గారి సారథ్యంలో ఇంటి ఇంటికీ తిరిగి అభ్యర్థులును గెలిపించు కుంటాం అనీ ఏకగ్రీవంగా తీర్మానం చెయ్యటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయపూడి వేణుగోపాల్ గారు, బచ్చు వెంకటనాద్ గారు, నేరస్సు కృష్ణ ఆంజనేయులు గారు, చెన్నగిరి.సత్యనారాయణ గారు, రాజనాల వీరబాబు గారు, జడ్పీటీసీ అభ్యర్థులు సిద్దినేని అశోక్ నాయడు గారు, గాజుల శంకర్ రావు గారు, ఎంపీటీసీ అభ్యర్థులు కటికల వసంత్, బొప్పన భాను, అర్జా రాధికా గారు,, మత్తి సుబ్రహ్మణ్యం, బొడ్డు విజయ్, బండిరెడ్డి మలిఖార్జునరావు, పృథ్వి, క్రాంత్ కుమార్, ప్రశాంత్, చందు, రవి, జయరాం తదితరులు పెద్ద మొత్తంలో జనసైనికులు పాల్గొన్నారు.