అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణం స్థానిక ఆర్ అండ్ బి విశ్రాంతి భవనం నందు గుత్తి మండల, పట్టణ కన్వీనర్లు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ అధ్యక్షతన ముఖ్య నాయకులు, జనసైనికులతో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో జనసేన నాయకులు, జనసైనికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పార్టీ క్యాడర్కు అండగా, మనోధైర్యాన్ని నింపేందుకు మరియు రాబోవు సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఈనెల 21, 22 తేదీలలో వీర మహిళలు సమావేశం, కార్యకర్తల ఆత్మీయ సమావేశం, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో శ్రమదాన కార్యక్రమం ఇలా పలు రకాల ముఖ్య సమీక్షలు, సమావేశాలు నిర్వహించేందుకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు గారు విచ్చేస్తున్నారు. ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గం మీదుగా వెళ్లే ఆయనకు గుత్తి టోల్గేట్ దగ్గర 21 తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు ఘన స్వాగతం పలికేందుకు మూడు మండలాల (పామిడి, గుత్తి, గుంతకల్) నాయకులు జనసైనికులు అందరూ సిద్ధంగా ఉండాలని అలాగే ఆరోజు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ, మండల అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యక్రమాల నిర్వాణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, నాగయ్య రాయల్, ఎన్ వెంకట నాయుడు, ఓబులేసు, హరి, సురేష్, మహేష్, రవితేజ, రామకృష్ణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…