గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ తరలింపు సమస్యను జనసేన పార్టీ PAC సభ్యులు శ్రీపంతం నానాజీ గారి దృష్టికి తీసుకెళ్లిన జనసైనికులు
ఉన్నత విద్యను అభ్యసించే స్తోమత లేని ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ ఐటీఐ కాలేజీలో చదువుకుని ఉన్నత స్థాయికి చేరిన వారు ఎంతో మంది ఉన్నారు. అనేక సాంకేతిక విషయాలతో ముడిపడి, కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ విద్యా సంస్థను ఇక్కడినుండి తరలించి తమ భవితను ప్రశ్నార్థకంగా చేసే ఈ చర్యను అడ్డుకోవాలని శ్రీ. పంతం నానాజీ గారిని విద్యార్థులు కోరడం జరిగింది. కాకినాడ గవర్నమెంట్ ఐటీఐ తరలింపు సమస్యను విద్యార్థులతో కలిసి ఈరోజు మన జనసేన పార్టీ PAC సభ్యులు శ్రీపంతంనానాజీ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. విద్యార్థుల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి విషయం తెలుసుకున్న శ్రీ నానాజీ గారు వారికి అండగా నిలబడతానని మాట ఇవ్వడం జరిగింది.