కాకినాడ, (జనస్వరం) : తుని నియోజకవర్గనికి చెందిన కొంతమంది చెరకు రైతులు యొక్క సమస్యలను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయాలనీ కోరుతూ ఈరోజు సూరంపాలెం చెరకు రైతులు కాకినాడలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీని కలిసి వారియొక్క సమస్యలను తెలియజేశారు. నానాజీ రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకుని ఈ సమస్యను పార్టీ పెద్దలదృష్టికి తీసుకువెళ్తానని వారికి హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా పాయకరావుపేట ప్రాంతంలో గల తాండవ షుగర్ ఫ్యాక్టరీకి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాలకి చెందిన సుమారు 4000 మంది రైతులకు 18 నెలల నుండి 8 కోట్ల బకాయిలు చెల్లించాల్సివుంది. అంతే కాకుండా ఇప్పుడు రైతు లదగ్గర నుండి చెరకు పంటను తీసుకోవడం లేదు. దానివల్ల దూర ప్రాంతానికి తక్కువ ధరకి తీసుకువెళ్తున్నారు. దానివలన రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. రాష్ట్ర కోపరేటివ్ మంత్రి దీనిపై సమగ్ర విచారణ చేసి చెరకు రైతులకు న్యాయం చేయాలని, వ్యవసాయ శాఖకు ఎలాగూ న్యాయం చేయలేదు. కనీసం చెరకు రైతులని ఆదుకోవాలని జనసేనపార్టీ తరుపున పంతం నానాజీ డిమాండ్ చేయడం జరిగింది.