Logo
Date of Publish : 01 December 2021, 4:45 pm
Editor : Sake Naresh

రైతులను మోసం చేసే భారీ స్కామ్..త్వరలో ఆధారాలతో సహా వెల్లడిస్తామన్న జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

   మండపేట, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు విమర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా మండపేట బాబు అండ్ బాబు కన్వర్షన్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసే భారీ స్కామ్ చేపట్టిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఈ జిల్లాకు చెందిన వైకాపా నేత డైరెక్షన్ లో భారీ కుంభకోణం చేపట్టారని దీన్ని ఆధారాలతో సహా వెల్లడిస్తామని పేర్కొన్నారు. జనసేన ఆధ్వర్యంలో ప్రధానంగా మూడు సమస్యలపై పోరాటం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రహదారుల దుస్థితి, నష్ట పోయిన రైతాంగానికి న్యాయం, ఓ టీఎస్ లో నిర్బంధ వసూళ్లు పై తాము పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. జనసేన రోడ్లపై పోరాటం చేస్తే గాని అతిగతి లేదన్నారు. సమస్యలపై స్పందించని ఏకైక ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని ఎద్దేవా చేశారు.13 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పటికీ కనీసం రోడ్ లు మరమ్మతులు చేయాలేని నిస్సహాయతలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఎవరి కోసం ఈ ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు. ప్రజల నుండి పన్నులు వసూలు చేసి కనీస రహదారి వంటి వసతులు కూడా కల్పించక పోవడం దురదృష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. బకాయిలు చెల్లించక పోవడంతో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదని ఇది ప్రభుత్వ దివాళా కోరు తనానికి నిదర్శనం అన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద వ్యక్తులు రైతులకు వ్యతిరేకంగా భారీ స్కామ్ చేపట్టి, రైతులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు నష్టం అంచనా వేయడంలో విఫలమయ్యారు. ముఖ్యమంత్రి లాప్ టాప్ తీసుకుని గదిలో కూర్చొని వేల కోట్లు ఖాతాల్లో వేశామని చప్పట్లు కోడుతున్నారని ఎద్దేవా చేశారు. స్వార్ధం లేకుండా పని చేయాల్సిన ప్రభుత్వం సమస్యలు నుండి పారిపోతున్నారని ఆరోపించారు. జిల్లాలో రూ 200 కోట్లు మరమ్మతులుకు వస్తే వెంటనే ప్రభుత్వం లాగేసుకుందని ఆరోపించారు. సర్పంచ్ ఖాతాలు ఖాళీ చేసిందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఎప్పుడో ఇచ్చిన గృహ రుణాలు ఇప్పుడు ఓ ఎస్ టి అంటూ ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతులను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. యువత, మహిళలను ఇబ్బందులు గురి చేసే కార్యక్రమలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గారికి స్పందించే గుణం ఉందని అందుకే తాము ప్రజలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ప్రజా పక్షాన ఈ ప్రభుత్వం పై పోరాటం చేసి వారి మెడలు వంచుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన ఇంఛార్జ్ లు వేగుళ్ళ లీలాకృష్ణ, మరెడ్డి శ్రీనివాస్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, శెట్టి బత్తుల రాజబాబు, ముత్తా శశిధర్, బండారు శ్రీనివాస్, పొలిశెట్టి చంద్ర శేఖర్, జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com