తిరుపతి, (జనస్వరం) : తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు ప్రారంభించారు. జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థిని గెలుపుంచుకొని తీరుతాం అని జనసేన పార్టీ PAC మెంబెర, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ తెలియజేశారు.
• తిరుపతిలో జనసేన ప్రభంజనం సృష్టిస్తాం :
జనసేన తెలుగుదేశం బీజేపీ సంయుక్తంగా కలిసి వైసీపీని ఇంటికి పంపుతుందని తెలియచేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న విధానాన్ని చూసి ప్రజల కష్టాలను తీర్చేవారు ఎవరు లేకుండపోయారు అలాంటి సమయంలో పవన్కళ్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్ర ప్రజలకు ఎన్నో గొప్ప పనులు చేసారు. అలాంటి వారికీ అధికారం ఇస్తే ఇంకెన్ని చేస్తారో ఆలోచించాలి అని తెలియచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ మాట్లాడుతూ జగన్ రెడ్డి వైసీపీ MLA లు చేస్తున్న అరాచకాలు అన్ని ప్రజలు తెలుసుకున్నారు. ఈసారి జగన్ రెడ్డికి తగిన బుద్ది చెప్తారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును ఇవ్వటమే పవన్ కళ్యాణ్ లక్యం అని తెలియచేసారు. నిస్వార్థంగా పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి మంచి భవిష్యత్ ఉంటుంది. 2024 లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడటమే మన లక్ష్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు జనసేన తిరుపతి కమిటీ నాయకులు, వార్డ్ కమిటీ, బూత్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com