
విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరియు జిల్లా నాయకులు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా జనసేన కేంద్ర కార్యాలయం అయ్యన్నపేటలో ఓపెనింగ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈనెల 22వ తేది నుంచి జిల్లాలో PAC చీఫ్ నాదెండ్ల మనోహర్ గారి పర్యటన యొక్క కార్యకలాపాలు కొరకు చర్చలు జరిపారు.