● దాచుకుంది, దోచుకుంది, దౌర్జన్యం చేసింది చాలు అని ప్రజల్లోకి MLAలను వెళ్లమంటున్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం ప్రజల ఆగ్రహనికి గురి కావాల్సిందే
● మహిళలు ఆగ్రహనికి గురైన కావలిలో వైసిపి MLA పరిస్థితి దీనికి ఉదాహరణ
● ఎలక్షన్ ముందు ముద్దుల మీద ముద్దులు పెట్టిన CM ఎన్నికల తర్వాత ఇప్పుడు గుద్దుల మీద గుద్దులు
● పన్నుల మీద పన్నులు వేసి ప్రజలపై భారం మోపుతుంది ఈ వైసిపి ప్రభుత్వం
నెల్లూరు, (జనస్వరం) : గత నెలలో రెండు వారాల పాటు జనసేన పార్టీ మత్స్యకారుల అభ్యున్నతి కొరకు, జీవో 217 కి వ్యతిరేకంగా జనసేన PAC ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో మేము కూడా గ్రామ గ్రామాలలో పాదయాత్ర చేసి మత్స్యకారుల ఇబ్బందులు తెలుసుకున్నాం. గత నెలలో నర్సాపురం మత్స్యకారుల అభ్యున్నతి సభలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి అండగా నిలబడతానని మాటిచ్చారని గుర్తు చేసారు. మత్స్యకారుల అభ్యున్నతి కొరకు అన్ని పార్టీల కంటే ముందుగా గళం విప్పినది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారే అని, మొదటగా పైలెట్ ప్రాజెక్టుగా మన నెల్లూరు జిల్లాలోనే ఈ జీవోను అమలు పరచాలని చూడటం దురదృష్టకరం అని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ జీవో అమలు పరచనివ్వమని తెలిపారు. మత్స్యకారుల ఉపాధిని, శ్రేయస్సును గాలి కొదిలి వారిని రోడ్లపై నిలబెట్టిందనీ, రానున్న ఎన్నికలలో వైసిపి ప్రభుత్వానికి ప్రజలు సరైన సమాదానం చెప్తారనీ, మత్స్యకారుల అభ్యున్నతికై జనసేన పార్టీ తరపున పోరాడుతామనీ తెలియజేసారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు ప్రమాదానికి గురైన మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే భీమా మొత్తం రూ 5 లక్షలు సరిపోదు 10లక్షలు ఇవ్వాలని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి వారి ప్రభుత్వంలో దాదాపు 300మంది ప్రమాదానికి గురైతే 61 మందికే కేవలం 5లక్షలు ఇవ్వటం దారుణం అని తెలిపారు. డీజిల్ రేట్లు పెరిగినా మత్స్యకారుల సబ్బిడీ పెంచకపోగా 3000లీటర్లకి ఇవ్వాల్సిన సబ్బిడి 300లీటర్లు మాత్రమే ఇస్తున్నారనీ తెలిపారు. మత్స్యకార గ్రామాలలో రోడ్లు, కాలుష్యం మరియు త్రాగు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వం జనసేన పార్టీ స్థాపించబోతుంది అని తెలిపారు. మత్యకారులకు సంఘీబావం తెలుపుతూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, దుగ్గిసెట్టి సుజయ్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు, జనసైనికులు, మత్స్యకార నాయకులతో పాటు అన్ని పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com