అరకు ( జనస్వరం ) : అరకు నియోజకవర్గంలోని ముంచంగిపుట్టు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆర్.శ్రావణ కుమార్ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని పంచాయతీ కేంద్రాల్లో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకోవటం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం చేసే చర్యల్లో భాగంగా పంచాయతీ కమిటీలు ఏర్పాటు చేయటం వంటి అంశాలకు సంబంధించి రూట్ మ్యాప్ ను తయారు చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం అరకు జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంచార్జ్ చెట్టి.చిరంజీవి సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ, మరియు ముంచంగిపుట్టు మండల నాయకులు జి సతీష్ కుమార్, కె చందు, పి మురళి, ఎం సూర్యనారాయణ, నాగేంద్ర, సన్యాసి, సాయి, గణ తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com