Logo
Date of Publish : 24 November 2020, 3:11 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమం కోసమే భీమా : ఎమ్మిగనూర్ ఇంచార్జ్ రేఖగౌడ్

జనసేనపార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమం కోసమే భీమా : ఎమ్మిగనూర్ ఇంచార్జ్ రేఖగౌడ్

                   జనసేనపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ రేఖగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువకులు అత్యధికంగా పార్టీ వైపు ఆకర్షితులై క్రియాశీలక భూమిక పోషిస్తున్నారని వారిని దృష్టిలో పెట్టుకొని అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు భీమా సదుపాయాన్ని కల్పించారని ప్రతి జనసైనికులు తప్పక సభ్యత్వం చేసుకోవాలని కోరారు. క్రీయాశీలక కార్యకర్తలు డిసెంబర్ 20 లోపు సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం గ్రామాలకు చెందిన ముఖ్య కార్యకర్తలకు సభ్యత్వం అందించి భీమా గురించి అవగాహన కల్పించారు. పార్టీ అభివృద్ధితో పాటు కార్యకర్తల సంక్షేమం కోరే గొప్ప నాయకుని బాటలో నడిచే ప్రతి కార్యకర్త సమస్యల కోసం వాటి పరిష్కారమార్గం కోసం మాత్రమే పనిచేస్తున్నారని ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకొని బలమైన సంకల్పంతో ముందుకు పోతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలతో మమేకమై రాబోయే రోజుల్లో యువశక్తి సత్తా చాటేల కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా, ఎమ్మిగనూరు మండల అధికార ప్రతినిధి, రాహుల్ సాగర్, గోనెగండ్ల అధికార ప్రతినిధి, జాని, వీరమహిళ పద్మావతి నాయకులు రామంజి, రవిప్రకాష్, షబ్బీర్, భాస్కర్, ఖాసీం, హరికృష్ణ, షఫీ, హనుమంతు, వీర కుమార్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com