రాజంపేట ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో వేడుకగా ముగ్గుల పోటీలు జరిగాయి. నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ, ఆర్ఎస్ రోడ్డులో జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు వెళ్ళువెత్తారు. ముగ్గుల బాక్సుల టోకండ్ల కోసం ఎగబడ్డారు. దాదాపు 200 మంది ఉత్సాహంగా పోటీపడ్డారు. ఎంబలూరు కళ్యాణి ప్రధమ బహుమతి 15000, ద్వితీయ, తృతీయ బహుమతులను ఝాన్సీ లక్ష్మి పదివేల రూపాయలు, వెంకటసుబ్బమ్మ ఐదువేల రూపాయలను గెలుచుకున్నారు. అనంతరం నిర్వహించిన మ్యూజికల్స్ చైర్స్ పోటీలలో వివాహితలు అత్యంత ఆనందంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో సి. మాధవి, ఎస్.లలిత సంయుక్త విజేతలుగా నిలిచారు. ఆర్ఎస్ రోడ్డు మొత్తం సాయంత్రం నుండి పెద్ద ఎత్తున హాజరైన మహిళలతో నిండిపోయి సంక్రాంతి పండగ సందడి ముందుగానే మొదలయింది. వివిధ ప్రాంతాల నుండి పండుగకు వచ్చినవారు ఈ పోటీలను తిలకించేందుకు ఆసక్తి చూపారు. ఈ పోటీలకు న్యాయ నిర్నేతలుగా డాక్టర్ శ్రీవాణి, యల్లటూరు మంజుల వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివరామరాజు, ఆకుల చలపతి, గురివి గారి వాసు, తిప్పాయపల్లె ప్రశాంత్, రాజేష్, రాయలసీమ జనసేన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కుప్పాల జ్యోతి మరియు మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com