
విజయనగరం, (జనస్వరం) : విజయనగరంలో హోటల్ కొండపల్లి గ్రాండ్ నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్, వైస్ చైర్మన్ రామచంద్రరావు, విశాఖ జిల్లా ప్రెసిడెంట్ రేవతి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబూ పాలురు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ సాంబ శివ ప్రతాప్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనసైనికులు పట్ల ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను అలాగే జనసైనికులు పాటించాల్సిన న్యాయపరమైన నిబంధనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో నియోజకవర్గ మండల స్థాయి లీగల్ టీమ్ లను జన సైనికులకు, వీర మహిళలకు అండగా భద్రతను ఇచ్చే విధంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సెల్ ప్రథాన కార్యదర్శి లోక్ నాథ్ పట్నాయక్, జిల్లా కార్యదర్శి శరత్ కుమార్, ఉత్తరాంధ్ర మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మిలక్ష్మీ రాజ్, రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు, విజయనగరం జిల్లా నాయకులు వబ్బిన సత్యనారాయణ, లాలిశెట్టి రవితేజ, గెద్ద రవి, పెద్ది వెంకటేష్, దిండి రామారావు, సంచాన గంగాధర్, పోతల శివ శంకర్, హిమరిక, గోరపల్లి రవికుమార్, గంగాధర్ అలాగే తొమ్మిది నియోజకవర్గాల జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.