Logo
Date of Publish : 30 January 2022, 4:52 pm
Editor : Sake Naresh

నరవ PHC లో మౌలిక సదుపాయాలు పునరుద్ధరించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన

   పెందుర్తి, (జనస్వరం) :  88 వార్డ్, నరవ గ్రామం, పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మౌలిక సదుపాయాలు పునరుద్ధరించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు వబ్బిన జనార్థన శ్రీకాంత్  మాట్లాడుతూ గత కొన్ని 4 నెలల నుండి నరవ PHCకి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా, ప్రజల ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టడం లేదని, మా దౌర్భాగ్యం ఏంటంటే మేము కొత్తగా ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదని, ఉన్నవాటిని ల్యాబ్, స్టాఫ్, వైద్య పరికరాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నామని, స్థానిక ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజ్ గారు స్థానిక కార్పొరేటర్ ముత్యాల నాయుడు వైఫల్యం వలన ఈరోజు మా యొక్క PHC కి ఈ దౌర్భాగ్యం పెట్టిందని, వారి తీరుకు నిరసనగా ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, మీడియా ప్రతినిధులు కూడా మా యొక్క సమస్య ను ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకు వచ్చేలాగా కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నా, గోపి, ప్రసాదు, అశోక్, నవీన్, బొడ్డు నాయుడు, గవర శీను, బోబ్బర శ్రీను, లింగం వాసు, ఓమ్మి అప్పలరాజు, ప్రవీణ్, ఇల్లపు నర్సింగరావు, బోండా రవిబాబు, మడక శివ, మరియు జనసైనికులు, ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com