పెందుర్తి, (జనస్వరం) : 88 వార్డ్, నరవ గ్రామం, పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మౌలిక సదుపాయాలు పునరుద్ధరించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు వబ్బిన జనార్థన శ్రీకాంత్ మాట్లాడుతూ గత కొన్ని 4 నెలల నుండి నరవ PHCకి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా, ప్రజల ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టడం లేదని, మా దౌర్భాగ్యం ఏంటంటే మేము కొత్తగా ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదని, ఉన్నవాటిని ల్యాబ్, స్టాఫ్, వైద్య పరికరాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నామని, స్థానిక ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజ్ గారు స్థానిక కార్పొరేటర్ ముత్యాల నాయుడు వైఫల్యం వలన ఈరోజు మా యొక్క PHC కి ఈ దౌర్భాగ్యం పెట్టిందని, వారి తీరుకు నిరసనగా ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, మీడియా ప్రతినిధులు కూడా మా యొక్క సమస్య ను ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకు వచ్చేలాగా కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నా, గోపి, ప్రసాదు, అశోక్, నవీన్, బొడ్డు నాయుడు, గవర శీను, బోబ్బర శ్రీను, లింగం వాసు, ఓమ్మి అప్పలరాజు, ప్రవీణ్, ఇల్లపు నర్సింగరావు, బోండా రవిబాబు, మడక శివ, మరియు జనసైనికులు, ప్రజలు పాల్గొన్నారు.