Logo
Date of Publish : 15 May 2022, 4:35 pm
Editor : Sake Naresh

జగ్గయ్యపేటలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర – పోస్టర్ ఆవిష్కరణ

            జగ్గయ్యపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర సందర్బంగా జనసేన పార్టీ జగ్గయ్యపేట ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నందు కౌలు రైతు భరోసా పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బాడీసా మురళీకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పవన్ కళ్యాణ్ గారు ముపై కోట్ల రూపాయలతో మూడు వేల మంది రైతులకు ఆర్థిక సహాయం అందించబోతున్నారని కౌలు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగువారి నూతన సంవత్సర ఉగాది రోజున పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారని అన్నారు. రాష్ట్ర రైతుల పట్ల, వ్యవసాయం పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఇప్పటివరకు రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులని చూసాం కానీ తన కష్టార్జితంతో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం అనే ఉద్దేశంతో ఎంతో ఉదార స్వభావంతో ముందుకు వచ్చిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వ్యవసాయ రంగం కుదేలైందని వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేయబడిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతు ల కుటుంబాలకు ఏడు లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల అధ్యక్షులు తులసి బ్రహ్మం, పెనుగంచిప్రోలు మండల అధ్యక్షులు తునికపాటి శివ, జనసైనికులు గోపి, నాగయ్య, దేవా తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com