దాచేపల్లి, (జనస్వరం) : వారం రోజుల పాటు దాచేపల్లిలోని బంగ్లా సెంటర్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహర దీక్షల్లో భాగంగా మూడవరోజు కొనసాగించటం జరిగింది. నిరాహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించే ముందు రోడ్డు మీద మిర్చి పంటని దగ్ధం చేసి నిరసన తెలపటం జరిగింది. అరగంటపాటు వాహనాలను ఆపి నష్టపరిహారం చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమలో మాట్లాడుతున్న రైతు సంఘం, ప్రజాసంఘాల నాయకులు రైతులు ఇన్ని కష్టాలలో ఉండి అప్పులపాలవుతున్న ప్రభుత్వాలు ఆదుకోకుండా కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద చెప్పుకుంటూ తప్పించుకుంటూన్నారని విమర్శించారు. రైతాంగం సంఘటితమై ఢిల్లీ పోరాట స్పూర్తితో ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా చేయాలంటే రైతు సంఘాలు బలపడటమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ఏపూరి గోపాలరావు, తెలనాకుల సత్య నారాయణ, కోలా నవజ్యోతి, కొమెర వెంకట్రావు, జక్కుల వీర స్వామి, ప్రజాసంఘాల నాయకులు ఆంజనేయరాజు, భీమవరపు కోటేశ్వర రావు, మందపాటి రమణా రెడ్డి, జనసేన పార్టీ నాయకులు అంబటి మల్లి, మందపాటి దుర్గారావు పాల్గొన్నారు. ఈ రోజు దీక్ష సిబిరంలో కోలా నవజ్యోతి, తెలనాకుల సత్యనారాయన, మాదాసు సత్యనారాయన, కొమరాజు లక్ష్మయ్య, సుబ్బరెడ్డి పాల్గొనడం జరిగింది.