Logo
Date of Publish : 09 September 2020, 2:00 pm
Editor : Sake Naresh

దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జనసేన పార్టీ నాయకుల నిరసన

దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జనసేన పార్టీ నాయకుల నిరసన

       దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విజయవాడలో ఈ రోజున జనసేన పార్టీ స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులు కత్తి. డేవిడ్, తాజ్నిత్ .మైనర్ బాబు మరియు ఎం .ప్రదీప్ రాజ్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులపై రోజురోజుకీ దాడులు దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు పెరిగిపోతున్నాయి. అయిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, దళితులపై దాడులకు సంబంధించి 150 కేసులు రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యాని, దళితుల అసైన్డ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు పలు గ్రామాల్లో ఇప్పటికే రంగం సిద్ధం చేశారని, వైసీపీకి ఓట్లు వేయలేదని దళితుల పెన్షన్లు నిలిపివేస్తున్నారని అయినంపూడిలో మచ్చ అంజమ్మ కుటుంబంపై దాడులు గానీ,  మచిలీపట్నంలో పద్మజ హత్యకేసులో గాని ఇప్పటి వరకు కనీసం మహిళా కమిషన్ స్పందించలేదు. దిశ చట్టం కింద కేసులు నమోదు కూడా చేయలేదంటే దళితుల పట్ల వైయస్ జగన్ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దళితులపై పార్టీల పేరుతో వేధింపులు ఎక్కువయ్యాయిని, అసైన్డ్ ల్యాండ్ లో అధికార పార్టీ నాయకులకు కబ్జాలు పెరిగిపోయాయిని, దళితులపై ఎక్కడపడితే అక్కడ శిరోముండనాలు జరుగుతున్న హోం శాఖ మంత్రి సుచరిత గారు దళిత వర్గానికి చెందిన వారే ఆయనప్పటికీ స్పందించడంలేదన్నారు. కార్పొరేటర్ అభ్యర్ధి కత్తి డేవిడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని, వైయస్ జగన్ ప్రభుత్వం దళిత ద్రోహుల ప్రభుత్వం అన్నారు. కార్పొరేటర్ అభ్యర్ధి మైనర్ బాబు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడుల్లో పోలీస్ శాఖ విచారణ అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో సవ్యంగా జరగడం లేదని, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తూ వాళ్ల అభివృద్ధిని జగన్ ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. దళితులు అంటే కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని అన్నారు. కార్పొరేటర్ అభ్యర్థి ప్రదీప్ రాజు మాట్లాడుతూ వైయస్సార్ సిపి ప్రభుత్వానికి ఓటు వేయకపోతే వారిని గ్రామ బహిష్కరణ చేస్తున్నారని, పథకాలు కూడా సవ్యంగా అమలు చేయడం లేదని, వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక పెళ్ళికానుక పథకాన్ని అటకఎక్కించారని ఆరోపించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com