Logo
Date of Publish : 28 October 2020, 3:27 pm
Editor : Sake Naresh

కాజులూరు మండలంలో మరో బృహత్తర కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకుల శ్రీకారం

కాజులూరు మండలంలో మరో బృహత్తర కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకుల శ్రీకారం

                    రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం, పెనుమళ్ళ గ్రామ పంచాయితీ, పెనుమళ్ళ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తలాటం సత్యవేణి, తలాటం త్రిమూర్తులు, తలాటం నాగు మరియు తలాటం దివ్య అత్యంత నిరుపేద జీవితాన్ని గడుపుతున్నారు. తల దాచుకోవడానికి కనీసం అంటే కనీసం సరైన గూడు కూడా లేని పరిస్థితి. వాళ్ళు నివసించే శిధిలావస్థకు చేరుకున్న పూరి పాక ఎంత దైనీయంగా ఉందో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. గట్టిగా గాలి వాన వస్తే వారు పడే బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. మొన్న కురిసిన అకాల వర్షాలకు మరింత దయనీయంగా మారింది వారి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్తితిలో మనిషికి కూడు, గుడ్డ మరియు నీడ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలిసిన విషయమే. ఒక కుటుంబాన్ని నిలబెట్టే ఈ బృహత్తర కార్యక్రమాన్ని మన పెనుమళ్ళ గ్రామ జనసేన నాయకుడు బత్తుల_సూరిబాబు మరియు తలాటం గంగాధర్ నా దృష్టికి తీసుకు రావడం జరిగింది. ఇదే విషయాన్ని మన నియోజకవర్గానికి చెందిన NRI శ్రీఅనిశెట్టిస్వామి గారితో చర్చించగా ఆయన వెంటనే స్పందించి పెద్ద మనసుతో దీనికి పూర్తి స్థాయిలో సహకరించడానికి ముందుకు రావడం జరిగినది. దీనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఆ కుటుంబానికి మన జనసేన పార్టీ తరపున అండదండలు అందివ్వడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి తమ వంతు సాయంగా స్వచ్ఛందంగా శ్రమదానం చేసి ఇంటిని నిర్మించడానికి ముందుకు వచ్చిన తాపీ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com