Logo
Date of Publish : 22 December 2020, 4:39 pm
Editor : Sake Naresh

అవనిగడ్డలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు జనసేన పార్టీ నాయకుల నివాళులు

అవనిగడ్డలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు జనసేన పార్టీ నాయకుల నివాళులు

                కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లి మండలంలోని చింతలమడ గ్రామంలో సుధాని సాంబశివరావు(47సంవత్సరాల) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. సదరు రైతు 5ఎకరాలు కౌలకు తీసుకుని వరి పంట వేయడం జరిగింది. మొన్న వచ్చిన నివార్ తుపాన్ వల్ల నోటికాడికి వచ్చిన పంట నీటిలో మునిగి పోవటం వల్ల చేసిన అప్పులు ఎలా తీర్చాలి అనే ఆవేదనతో పురుగుల మందు తాగి బలవంతంగా తన ప్రాణం తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు అయిన విషయం. జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తక్షణ సహాయం క్రింద రైతులకు ఒక ఎకరాకు 10వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని నిరసన కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు ఆరు మండలాల్లోని జనసైనికులు చింతలమడ గ్రామం వెళ్లి చనిపోయిన రైతు(సాంబశివరావు) భౌతికకాయంను సందర్శించి ఘనమైన నివాళులు అర్పించి ఆ కుటుంబంకు జనసేనపార్టీ తరుపున సానుభూతి తెలియజేయడం జరిగింది. ఇప్పటికి అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఇది కౌలు రైతుల 4వ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పటికయినా రాష్ట్రప్రభుత్వం కళ్ళు తెరిచి నష్టపోయిన ప్రతి ఎకరాకు 35వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి అని అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 10లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మత్తి. సుబ్రహ్మణ్యం, బండ్రెడ్డి మల్లికార్జున్ రావు, నందగోపాల్, విమలకృష్ణ, షరీఫ్, తోట నాగరాజు, కురేటి జగన్, జయరాం, ఆళ్ళమల.చందు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com